సింధు, సేన్ రాణించేనా.!

సింధు, సేన్ రాణించేనా.!


ఒడెన్స్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌):  ఇండియా బ్యాడ్మింటన్ స్టార్స్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ తిరిగి ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవడమే లక్ష్యంగా మంగళవారం మొదలయ్యే డెన్మార్క్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 750 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమయ్యారు. గతవారం జరిగిన ఆర్కిటిక్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సింధు తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఓడగా.. సేన్ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌తో పోరు ముగించాడు. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌లో అయినా సత్తా చాటాలని ఆశిస్తున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో చైనా షట్లర్ లూ గ్వాంగ్‌‌‌‌‌‌‌‌ జుతో  లక్ష్యసేన్ తలపడతాడు.

 విమెన్స్‌‌‌‌‌‌‌‌లో  సింధు చైనీస్‌‌‌‌‌‌‌‌ తైపీకి చెందిన పై పు పొతో పోరు ఆరంభించనుంది. చైనా ఓపెన్‌‌‌‌‌‌‌‌లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరిన మాళవిక బన్సొద్‌‌‌‌‌‌‌‌, ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌, యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతి హుడా కూడా బరిలో నిలిచారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ, శ్వేతపర్ణ–రుతపర్ణ, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సుమీత్ రెడ్డి–సిక్కిరెడ్డి, సతీశ్‌‌‌‌‌‌‌‌–ఆద్య జంటలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.