ఈ నెల 22 నుంచి డెంటా వాటర్​ ఐపీఓ

న్యూఢిల్లీ:  వాటర్, ఇన్​ఫ్రా సొల్యూషన్స్​కంపెనీ డెంటా వాటర్​ అండ్​ఇన్​ఫ్రా సొల్యూషన్స్​లిమిటెడ్​ ఐపీఓ ఈ నెల 22న మొదలై 24న ముగియనుంది. ప్రైస్​బ్యాండ్​ను రూ.279–294 మధ్య నిర్ణయించారు. ఐపీఓలో రూ.220.4 కోట్ల విలువైన ఫ్రెష్​ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్​లేదు. 

రూ.150 కోట్లను వర్కింగ్​క్యాపిటల్​, సాధారణ కార్పొరేట్ ​అవసరాలకు వాడతారు. 2016లో మొదలైన ఈ కంపెనీ వాటర్​ ఇంజనీరింగ్​, ప్రొక్యూర్​మెంట్​, కన్​స్ట్రక్షన్​(ఈపీసీ)​ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు 32 వాటర్​ మేనేజ్​మెంట్​ ప్రాజెక్టులను పూర్తి చేసింది.