ఖమ్మంలో డెంటల్   స్టూడెంట్ సూసైడ్

  • ఖమ్మంలో డెంటల్   స్టూడెంట్ సూసైడ్
  • హాస్టల్​లో పెట్రోల్  పోసుకుని నిప్పంటించుకుని మృతి

ఖమ్మం, వెలుగు :  ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో డెంటల్ నాలుగో సంవత్సరం స్టూడెంట్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్​కు చెందిన మానస(22) ప్రైవేట్ ​హాస్టల్​లో ఉంటూ చదువుకుంటున్నారు.  ఆదివారం హాస్టల్ రూమ్​లో ఆమె పెట్రోల్  పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగడంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. నిర్వాహకులు రూమ్​ తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లే సరికే ఆమె పూర్తిగా కాలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని, మానస ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదన్నారు.