విద్యార్థులు సైంటిస్టులు కావాలి : డీఈవో అబ్దుల్​ఘనీ

విద్యార్థులు సైంటిస్టులు కావాలి : డీఈవో అబ్దుల్​ఘనీ

 పాన్​గల్, వెలుగు: సైన్స్‌‌ ఫేర్‌‌‌‌లో  పాల్గొన్న ప్రతి విద్యార్థి సైంటిస్టు కావాలని జిల్లా ఎడ్యుకేషన్​ఆఫీసర్​అబ్దుల్​ ఘనీ అన్నారు.  మంగళవారం తెల్లరాళ్లపల్లిలోని లిటిల్ స్టార్ హై స్కూల్‌‌లో సైన్స్​ ఫేర్​ నిర్వహించారు. డీఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడంతో పాటు ఇలాంటి సైన్స్​ఫేర్‌‌‌‌లలో పాల్గొనడం ద్వారా ప్రాక్టికల్‌‌గా సబ్జెక్టులను తెలుసుకోగలుగుతారని అన్నారు.

 స్టూడెంట్లు శ్రద్ధగా చదువుకొని టీచర్లకు, తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్​కరస్పాండెంట్​ఆంజనేయులు, ఎంఈఓ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ముంత శేఖర్, ట్రస్మ నాయకులు ప్రకాశ్ బాబు, జేవీవీ జితేందర్ గౌడ్, రచయిత జన జ్వాల తదితరులు పాల్గొన్నారు.