ఆరుగురు టీచర్లకు షోకాజ్​ నోటీస్

ఆరుగురు టీచర్లకు షోకాజ్​ నోటీస్

నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎలక్షన్​ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గైర్హాజరైన ఆరుగురు టీచర్లకు  మంగళవారం డీఈవో అశోక్​ షోకాజ్​నోటీసులు జారీ చేశారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు ధర్మారం జడ్పీ హై స్కూల్​ హెచ్ఎం సంధ్యానాయక్(ధర్మారం- బి)​, జడ్పీ స్కూల్​ అసిస్టెంట్లు​ లక్ష్మీనాథం(ఇందల్వాయి),  నారాయణ(ఘన్​పూర్​), హుస్సేని బుకారి (డిచ్​పల్లి రైల్వే స్టేషన్​)​, జి.సాయిలు (సాలూరా), స్వామి (జాకోరా)లకు నోటీసులు  పంపారు. రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని లేకపోతేయాక్షన్​ తీసుకుంటామని స్పష్టం చేశారు.