బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక : డీఈవో దుర్గా ప్రసాద్​

బోధన్, వెలుగు: తెలంగాణ ప్రాంతంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండగ ఎంతో ప్రత్యేకమని డీఈవో దుర్గాప్రసాద్​పేర్కొన్నారు. గురువారం బోధన్​లోని ఇందూర్​స్కూల్ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్​మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువులతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై కూడా అవగాహన ఉండాలన్నారు.

విద్యార్థులు తీరొక్క పూవ్వులతో తయారు చేసిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.లయన్స్​320 డీ గవర్నర్​లక్ష్మి, స్కూల్​కరస్పాండెంట్​కొడాలి కిశోర్, లయన్స్​ ప్రతినిధులు శ్రీనివాస్​రావు, థామసయ్య, రవి, కె.ఎస్. రామరావు, కె.స్వాతి పాల్గొన్నారు.