కల్వకుర్తి, వెలుగు: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల అటెండెన్స్ ను ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా అమలు పరచాలని డీఈఓ గోవిందరాజులు ఆదేశించారు. శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ కు అనుసంధానంగా బోధన ఉండాలన్నారు.
టీచర్స్ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరచాలన్నారు. ఆబ్సెంట్ విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి రెగ్యులర్ గా వచ్చేటట్టు చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు కృష్ణారెడ్డి, బాసు నాయక్, ప్రసూన, వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు.