214  మంది టీచర్లకు పోస్టింగ్...అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌన్సెలింగ్ 

214  మంది టీచర్లకు పోస్టింగ్...అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌన్సెలింగ్ 

కరీంనగర్, వెలుగు: డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు పొందిన 214 మంది అభ్యర్థులకు డీఈవో జనార్దన్ రావు మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఉదయాన్నే అభ్యర్థులంతా కలెక్టరేట్ కు రాగా.. కౌన్సెలింగ్ క్యాన్సిల్ అయిందంటూ మెస్సేజ్ లు రావడంతో అంతా వెనుదిరిగారు. కౌన్సెలింగ్ ఉంటుందని మళ్లీ మధ్యాహ్నం సమాచారం రావడంతో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అందరికీ పోస్టింగ్ ఇచ్చే వరకు అర్ధరాత్రి అయింది. పోస్టింగ్ పొందినవారంతా బుధవారం తమకు కేటాయించిన స్కూళ్లలో  రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

ఐదుగురి పోస్టింగ్ పెండింగ్ లో.. 

ప్రస్తుత డీఎస్సీలో 245 పోస్టులకుగాను 219 అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవిగాక  మరో 26 పోస్టులకు మెరిట్ జాబితాలో అభ్యర్థులు లేని కారణంగా ఎవరినీ నియమించలేదు. అయితే ఫైనల్ గా ప్రకటించిన 219లోనూ ఐదుగురు అభ్యర్థులకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెండింగ్ లో పెట్టారు. వీరిలో ఒకరు గతంలో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపిక కాగా అప్పుడో ఒక జిల్లాను లోకల్ గా చూపి.. ఇప్పుడు టీచర్ పోస్టుకు కరీంనగర్ జిల్లా స్టడీ సర్టిఫికెట్ చూపడంతో పెండింగ్ లో పెట్టారు.

మరో ఇద్దరు అభ్యర్థుల నేషనల్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ విషయంలో వివాదం ఉండడంతో క్లారిటీ కోసం పక్కన పెట్టారు. కరీంనగర్ కు చెందిన మహిళా అభ్యర్థి 2012 డీఎస్సీకి బీసీ(బీ) సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అప్లై చేయగా.. 2024లో బీసీ(ఈ)గా అప్లై చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై తర్వాతి మెరిట్ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించి కంప్లయింట్ చేయడంతో సదరు అభ్యర్థికి పోస్టింగ్ ఆపారు. మరో మహిళా అభ్యర్థి టీచర్ పోస్టుకు ఎంపికైనా ఇప్పటి వరకు రిపోర్టు చేయలేదు.  ఈ ఐదుగురి విషయంలో క్లారిటీ తీసుకున్నాకే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు. 

73 మందికి పోస్టింగులు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో  కొత్తగా కొలువులు సాధించిన 73 మంది టీచర్లకు మంగళవారం కలెక్టరేట్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టర్ శ్రీహర్ష ఆయా టీచర్లకు జిల్లాలో స్కూళ్లు కేటాయించి పోస్టింగ్ పత్రాలను అందించారు. టీచర్లు బుధవారం స్కూళ్లలో జాయిన్ కావాలని సూచించారు.

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ పోస్టుల్లో 6 బయోలాజికల్ సైన్స్, 3 తెలుగు, 5 హిందీ, 1 ఉర్దూ, 2 పీడీ,15 సోషల్,3 ఇంగ్లీష్, 2 ఫిజికల్ సైన్స్, 7 మ్యాథ్స్, 1 ఉర్దూ మీడియం సోషల్, 1 పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ల కింద 3 తెలుగు, 2 హిందీ, సెకండ్ గ్రేడ్ టీచర్లుగా 13 తెలుగు, 3 ఉర్దూ, 6 ఆరుగురికి స్పెషల్లైజేషన్ కింద పోస్టింగ్లు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.