స్టూడెంట్స్​ సైంటిస్టులుగా ఎదగాలి : డీఈఓ వెంకటేశ్వరాచారి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్టూడెంట్స్ ​సైంటిస్టులుగా ఎదిగేందుకు సైన్స్​ టాలెంట్​ టెస్టులు దోహదపడుతాయని డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్​ టాలెంట్​ టెస్ట్​లో విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే ప్రయోగాల పట్ల స్టూడెంట్స్​ అవగాహన కల్పించేందుకు సైన్స్​ టాలెంట్​ టెస్ట్​లు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ప్రోగ్రాంలో జిల్లా విద్యాశాఖ అకడమిక్​ మానిటరింగ్​ఆఫీసర్​ నాగరాజ శేఖర్, జిల్లా సమ్మిళిత విద్యా అధికారి ఎస్​కే. సైదులు, జిల్లా ప్లానింగ్​ కో ఆర్డినేటర్​ ఎన్. సతీశ్, జిల్లా సైన్స్​ ఆఫీసర్​ చలపతి రాజు, సైన్స్​ టీచర్లు జీ. అనురాధ, ఎ. శంకర్, టీ.మాధవరావు, ఉమాదేవి, సునందిని, బోళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.