సైన్స్​ నిత్య జీవితంలో భాగం : డీఈవో పార్శి అశోక్

సైన్స్​ నిత్య జీవితంలో భాగం : డీఈవో పార్శి అశోక్

నిజామాబాద్, వెలుగు : మనుషుల నిత్యజీవితంలో సైన్స్ ఓ భాగమని డీఈవో పార్శి అశోక్​ అన్నారు. శుక్రవారం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలోని దివ్యాంగుల స్కూల్​ విద్యార్థులు నిర్వహించిన నేషనల్ సైన్స్​ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి,  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.

కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు, రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత విజయానందరావు, జిల్లా సైన్స్​ అధికారి గంగాకిషన్​, అర్బన్​ సీడీపీవో సౌందర్య, స్నేహ సొసైటీ సెక్రటరీ ఎన్​.సిద్ధయ్య, స్పెషల్​ స్కూల్​ ప్రిన్సిపాల్​ జ్యోతి,  మానసిక వికలాంగుల స్పెషల్ స్కూల్​ ప్రిన్సిపాల్​ రాజేశ్వరి ఉన్నారు.

ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి

బోధన్​, వెలుగు :  ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని జిల్లా సైన్స్​ ఆఫీసర్ గంగాకిషన్ సూచించారు. శుక్రవారం బోధన్​లోని విజయసాయి స్కూల్​లో నేషనల్​ సైన్స్​ డే నిర్వహించారు. ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​, అకడమిక్​ ఇన్​చార్జి సువర్చల, చక్రవర్తి పాల్గొన్నారు.


బీర్కూర్​లో..

బీర్కూర్​, వెలుగు :  బీర్కూర్​లోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర కళాశాలలో శుక్రవారం జాతీయ సైన్స్​ డే నిర్వహించారు.  స్టూడెంట్లు తయారు చేసిన ప్రయోగ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  ప్రిన్సిపాల్​ శివ కుమార్ విద్యార్థులను అభినందించారు.