![టాలెంట్ టెస్టులు ప్రతిభకు దోహదం : డీఈవో రాధాకిషన్](https://static.v6velugu.com/uploads/2025/02/deo-radhakishan-stresses-importance-of-talent-tests-for-students-growth_YIpliSE6PO.jpg)
మెదక్, వెలుగు: టాలెంట్ టెస్టులు స్టూడెంట్స్ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయని డీఈవో రాధాకిషన్అన్నారు. ఫిజికల్ సైన్స్ టీచర్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ సోమవారం మెదక్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ..టాలెంట్ టెస్టులు స్టూడెంట్స్ను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తాయన్నారు. సైన్స్ పై అభిరుచిని ఏర్పరచుకొని భావిభారత సైంటిస్టులుగా ఎగదాలని ఆకాంక్షించారు.
రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ రమేశ్ బాబు స్టూడెంట్స్పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అవగాహన కల్పించారు. జిల్లా అకడమిక్ మానిటర్ ఆఫీసర్ సుదర్శన్ మూర్తి మాట్లాడుతూ టెన్త్ స్టూడెంట్స్కు ఇది ముఖ్యమైన దశ అని, శ్రద్ధగా చదవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు.
జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన స్టూడెంట్స్కు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఫోరం బాధ్యులు మల్లారెడ్డి, కృష్ణ, ప్రభు, దయానంద రెడ్డి, నాగేంద్రబాబు, నర్సింలు, శ్రీనివాస్, దశరథం, రజిని, మమత శ్రీవాణి పాల్గొన్నారు.