స్టూడెంట్స్ టెన్త్​లో మంచి రిజల్ట్స్​ సాధించాలి : డీఈవో రమేశ్​కుమార్

స్టూడెంట్స్ టెన్త్​లో మంచి రిజల్ట్స్​ సాధించాలి : డీఈవో రమేశ్​కుమార్

ఉప్పునుంతల/వంగూరు, వెలుగు: టెన్త్​లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రమేశ్​కుమార్  సూచించారు. బుధవారం వంగూరు, ఉప్పునుంతల మండలాల్లోని వంగూర్, డిండిచింతపల్లి, నిజామాబాద్, ఉప్పునుంతల, పిరట్వానిపల్లి స్కూళ్లను డీఈవో తనిఖీ చేశారు. టెన్త్​ విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. 

కోస్గి/మద్దూరు: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని డీఈవో గోవిందరాజులు సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత, జడ్పీ బాయ్స్, గర్ల్స్​ స్కూళ్లతో పాటు మద్దూరు జడ్పీ హైస్కూల్​ను తనిఖీ చేశారు. ప్రత్యేక తరగతులపై హెచ్ఎంలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, రికార్డుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. డీఈఓ వెంట ఎంఈవో శంకర్​నాయక్  ఉన్నారు.