మెనూ ప్రకారం భోజనం అందించాలి : డీఈవో రమేశ్ కుమార్

మెనూ ప్రకారం భోజనం అందించాలి : డీఈవో రమేశ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  తెలకపల్లి మండలంలోని రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం డీఈవో రమేశ్ కుమార్ విజిట్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. 

9వ తరగతి ఇంగ్లిష్  మీడియం విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు, వర్క్ అండ్ ఎనర్జీ, ఆరో తరగతి విద్యార్థులకు హిస్టీరియల్ కన్స్ట్రక్షన్స్ అనే పాఠ్యాంశాలను బోధించారు.  మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు.