బచ్చన్నపేట,వెలుగు: స్కూళ్లలో తప్పులు జరిగితే సహించేది లేదని జనగామ డీఈఓ రాము హెచ్ఎంలను, టీచర్లను హెచ్చరించారు. ఇటీవల కలెక్టర్ ఆదేశాలమేరకు డీఈఓ 47 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో గురువారం ఆయన బచ్చన్నపేట మండలంలోని కేజీబీవీ, చిన్నరామచర్ల ప్రాథమిక పాఠశాల, కొన్నె, పడమటికేశ్వపూర్ హైస్కూళ్లను సందర్శించి, టీచర్లతో మీటింగ్ నిర్వహించారు. స్టూడెంట్ల హాజరు శాతం పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని చెప్పారు. అనంతరం ఆయన పలువురు స్టుడెంట్లతో మాట్లాడారు.