ఇంగ్లిష్ ​టీచర్లు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి :  డీఈవో రవీందర్​రెడ్డి

ఇంగ్లిష్ ​టీచర్లు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి :  డీఈవో రవీందర్​రెడ్డి

మహబూబాబాద్, వెలుగు : ఇంగ్లిష్ ​టీచర్లు విద్యార్థుల్లో కమ్యూనికేషన్​ స్కిల్స్​పెంచాలని డీఈవో రవీందర్​రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఏకశిలా ఏంజెల్స్ హై స్కూల్ లో మహబూబాబాద్ జిల్లాస్థాయి ఆంగ్ల ఒలంపియాడ్, ఉపన్యాస పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఆంగ్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పకుండా ఆంగ్ల పత్రికలు చదవాలని, స్పెల్ బీ, స్పెల్ విజర్డ్ లాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనాలని సూచించారు.

పోటీ పరీక్షల్లో విజేతలకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఎల్టా మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయగాని రామ్మోహన్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏకశిలా ఏంజెల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్ రెడ్డి, ఎల్టా జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.