తనను చూసి నవ్వారని.. స్టూడెంట్లను చెప్పుతో కొట్టిన టీచర్.. సస్పెండ్‌‌‌‌ చేసిన డీఈవో

తనను చూసి నవ్వారని..  స్టూడెంట్లను చెప్పుతో కొట్టిన టీచర్..  సస్పెండ్‌‌‌‌ చేసిన డీఈవో

 అచ్చంపేట, వెలుగు : తనను చూసి నవ్వారన్న అనుమానంతో ఓ టీచర్‌‌‌‌ స్టూడెంట్లను చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జడ్పీ హైస్కూల్‌‌‌‌లో శనివారం జరిగింది. స్థానికులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... హైస్కూల్‌‌‌‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్లు శనివారం స్కూల్‌‌‌‌ ఆవరణలో ఆడుకుంటూ, నవ్వుకుంటున్నారు. 

ఆ టైంలో అటుగా వచ్చిన ఇంగ్లిష్‌‌‌‌ టీచర్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ‘నన్ను చూసి నవ్వుతారా ?’ అంటూ తిట్టడమే కాకుండా చెప్పుతో కొట్టాడు. దీంతో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు స్కూల్‌‌‌‌కు వచ్చి టీచర్‌‌‌‌ను ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పగా వారు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న డీఈవో రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ టీచర్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డిని సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు.