భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, ఎన్సీఈఆర్టీ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్‌కు స్పెల్ విజార్డ్ పోటీలు నిర్వహించనున్నట్టు డీఈఓ వెంకటేశ్వరాచారి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) జిల్లా అధ్యక్షుడు ఎస్కే దస్తగిరి తెలిపారు. పోటీలకు సంబంధించి పోస్టర్లను డీఈఓ ఆఫీస్‌లో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టూడెంట్స్‌లో ఇంగ్లీష్‌లో నైపుణ్యాలను పెంచేందుకు ఎల్టా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆంగ్లంలో స్పెల్ విజార్డ్, డ్రామా పోటీలు ఉంటాయన్నారు. ఈ నెల 22న స్కూల్ లెవెల్, 29న మండల్ లెవెల్, ఫిబ్రవరి 13న జిల్లా లెవెల్లో
19నఉమ్మడి జిల్లా స్థాయిలో, 26న స్టేట్ లెవెల్లో పోటీలు జరుగనున్నాయని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో వి. వెంకటేశ్వరరావు, జహంగీర్, షరీఫ్, ఇంద్రసేనారెడ్డి, మాధవరావు, నాగరాజశేఖర్, సతీశ్, బాలు పాల్గొన్నారు.