టెన్త్​ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు టీచర్లు కృషి చేయాలి : వెంకటేశ్వరాచారి

భద్రాచలం, వెలుగు : పదో తరగతిలో ఉత్తీర్ణత శాతానికి పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని  డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. భద్రాచలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఆర్ఎస్​యాప్​లో పిల్లల రిజిస్ట్రేషన్​ను తనిఖీ చేశారు. 

పదో తరగతిలో 10 జీపీఏ సాధించేందుకు ప్రణాళికలతో చదవాలని బాలికలకు సూచించారు. టీచర్లు కూడా నిరంతర విద్యాబోధనను అందించి అధిక ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు అన్నామని, ఎస్కే సైదులు, సతీశ్​కుమార్, స్పెషల్​ ఆఫీసర్​ పి.లీల ఉన్నారు.