
- విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నెన్నెల జిల్లా పరిషత్‌పాఠశాల హెచ్ఎం దండనాయకుల ప్రకాశ్‌రావుపై డీఈఓ యాదయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నెన్నెల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించి టీచర్ల హాజరు పట్టికను తనిఖీ చేశారు.
రిజిస్టర్లో లీవ్, ఓడీ(ఆన్‌డ్యూటీ) లాంటి వివరాలను ఖాళీగా ఉంచడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణపై టీచర్లు అలసత్వం వహించవద్దన్నారు. పదిలో 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం పరీక్షా కేంద్రంలోని వసతులు, స్టూడెంట్ల సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని
ఆదేశించారు.