మార్చి 4, 5 తేదీల్లో డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటల్ అభ్యర్థులకు వైవా

మార్చి 4, 5 తేదీల్లో డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటల్ అభ్యర్థులకు వైవా

హైదరాబాద్, వెలుగు: డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటల్ టెస్ట్ (లాంగ్వేజ్ పరీక్షలు)లో ఎలిజిబులిటీ సాధించిన అభ్యర్థులకు మార్చి 4, 5 తేదీల్లో వైవా నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ http://tspsc.gov.inలో అప్ లోడ్ చేశామని తెలిపింది. 

వైవాకు అభ్యర్థులు హాల్ టికెట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంప్లాయి ఐడీ కార్డులను సైతం వెంట తెచ్చుకోవాలని సూచించింది. వైవాకు వచ్చే అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే రిపోర్టు చేయాలని తెలిపింది. బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అభ్యర్థులు మెహెందీ, టెంపరరీ టాటూలు వేసుకోవద్దని సూచించింది.