న్యూఢిల్లీ: బ్యాంకుల్లోని మొత్తం డిపాజిట్లలో కేవలం 20.8 శాతం మాత్రమే మహిళలకు చెందినవని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. దేశంలోని మొత్తం బ్యాంక్ అకౌంట్లలో 36.4 శాతం మహిళలకు చెందినవి కాగా, వీటి సంఖ్య 91.77 కోట్లుగా ఉంది. ఎన్‌ఎస్‌ఓ రిపోర్ట్ ప్రకారం, మొత్తం డిపాజిట్ల విలువ రూ.187 లక్షల కోట్లుగా ఉంటే ఇందులో రూ.39 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో ఉన్నాయి.
పట్టణాల్లోని మహిళల ఖాతాల్లో రూ.1.9 లక్షల కోట్లు ఉంటే, గ్రామాల్లోని మహిళల ఖాతాల్లో రూ.5.91 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన జన్ ధన్ స్కీమ్‌తో గ్రామీణ మహిళల ఖాతాల్లో డిపాజిట్లు పెరిగాయి. బ్యాంకుల్లో 4,41,000 మంది మహిళలు పని చేస్తుండగా, 13.2 లక్షల మంది మగవారు పనిచేస్తున్నారు.