ఆర్మూర్, వెలుగు : శ్రావణమాసం సందర్భంగా ఆర్టీసీ డిస్కౌంట్ ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్ పి.రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్ళిళ్లకు, ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్లో ప్రయాణించేందుకు బస్ బుక్ చేసుకునే వారికి శ్రావణమాసంలో మాత్రమే 10 శాతం డిస్కౌంట్ఇస్తున్నట్లు తెలిపారు.
ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్ లను బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.