భార్య ఫేస్ బుక్, ఇన్ స్ట్రా వాడొద్దని చెప్పటం భర్త క్రూరత్వమే : హైకోర్టు

భార్య ఫేస్ బుక్, ఇన్ స్ట్రా వాడొద్దని చెప్పటం భర్త క్రూరత్వమే : హైకోర్టు

భార్యభర్తల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.  ఓ డైవర్స్​ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు.. భార్తభర్తలకు సంబంధించిన  ఒకరి  ఫేస్​బుక్​.. ఇన్​స్ట్రాగ్రామ్​ను మరొకరు వాడొదనడం అనేది  అనేది క్రూరత్వానికి సమానమైనదని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ​హిందూవివాహ చట్టం(HMA) కింద విడాకులు కోరుతూ ఓ భర్త దాఖలు చసిన పిటిషన్​ ను తెలంగాణ హైకోర్టు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్  విచారించింది.   కేసు వివరాల్లోకి వెళ్తే...

మహబూబ్​నగర్​ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి  2021 నవంబర్​ 2 న జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.  ఫిర్యాదు దారుడు దాఖలు చేసిన విడాకుల పిటిషన్​ ను  HMA, 1955 యాక్ట్​ న్ 13 (1) (ia) మరియు (ib) కింద  అప్పీలుదారు  పిటిషన్‌ను కొట్టివేసింది.  హైకోర్టులో ఈ అప్పీల్​ పై విచారణ జరుగగా.. కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. భార్యభర్తలు కలిసి ఉండటం అనేది వారి మనస్సుల కలయికపై ఆధారపడి ఉంటుందని  తెలంగాణ హై కోర్టు  తీర్పు వెలువరించింది.  జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని వెల్లడించింది.  

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..  అప్పీలుదారు (భర్త)...  ప్రతివాది (భార్య) డిసెంబర్ 1, 2010న హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరి మధ్య  డిసెంబర్ 4, 2010 నుండి  అభిప్రాయ బేధాలు రావడంతో ...  నవంబర్ 1, 2011నుంచి ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు.  వీరి దాంపత్య జీవితంలో సెప్టెంబర్ 13, 2011న ఒక బిడ్డ జన్మించింది.   భార్య జూలై 11, 2012న ఫిర్యాదు చేసింది.   భర్త ...  అతని కుటుంబం ఆగస్టు 25, 2012న ముందస్తు బెయిల్ పొందింది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన  అప్పీలుదారు  2012లో విడాకుల కోసం దాఖలు చేసినప్పటికీ, అతను కేసును కొనసాగించలేదు. భార్య IPC సెక్షన్ 498-A కింద ఆరోపణలతో సహా అప్పీలుదారుపై ఐదు క్రిమినల్ కేసులను దాఖలు చేశారు.  అయితే వీరి మధ్య కొంతమంది కుటుంబ పెద్దలు రాజీ చేయడంతో మే 2015 నుంచి కొంతకాలం కలిసి జీవించారు. తరువాత కూడా భార్య మళ్లీ భర్తపై కేసులు పెట్టడం ప్రారంభించారు. 

నవంబర్​20 21లో విడాకుల కోసం భర్త వేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. తన భార్య పదే పదే క్రిమినల్ కేసులు పెట్టడం శారీరకంగానూ, మానసికంగానూ క్రూరంగా ఉందని వాదిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. 2011లో  ఆమె తనను విడిచిపెట్టిందని... మరిన్ని కేసులు నమోదు చేయడానికి ముందు 2015లో కొంతకాలం మాత్రమే తిరిగి వచ్చిందని కూడా అతను పేర్కొన్నాడు.  ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు 2011 నుంచి సుదీర్ఘకాలం విడిపోవడం... వీరి వివాహబంధం కోలుకోలేని విధంగా విచ్చిన్నమైందని కోర్టు పేర్కొంది.  వివాహం అనేరి ప్రమాణాల మార్పిడితో ఒక వేడుక అంటూ..  కలిసి మెలిసి ఉండాల్సిన భార్యభర్తల్లో ఒకరి ఫేస్​ బుక్​, ఇన్​స్ట్రాగ్రామ్ ను మరొకరు వాడొద్దనడం క్రూరత్వం లాంటిదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయ పడింది.  ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు వీరి వివాహబంధం.... తిరిగి నిర్మించలేకుండా ఉందంటూ.. భార్యభర్తలుగా రాజీపడి కలిసి జీవించమని కోర్టు బలవంతం చేయదంటూ...  విడాకులు మంజూరు చేసింది.