- మరో డివిజన్‌కు పంపుతున్నారంటున్న యూనియన్ లీడర్లు
కామారెడ్డి, వెలుగు:కామారెడ్డి జిల్లాలో అడ్జస్ట్మెంట్ల పేరుతో టీచర్ల డిప్యూటేషన్ల పర్వం సాగుతోంది. స్థానిక అవసరాలు, స్టూడెంట్స్ సంఖ్యను బట్టి అదే మండలంలో టీచర్లను డిప్యూటేషన్ వేయాలి. కానీ జిల్లాలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో రూల్స్‌కు విరుద్ధంగా డిప్యూటేషన్లు వేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ సర్దుబాట్లపై టీచర్ యూనియన్ నేతలు అత్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించగా, కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఉన్నా టీచర్ల కొరత ఏర్పడింది.
సబ్జెక్ట్ టీచర్ల ప్రాబ్లమ్ వచ్చింది. స్టూడెంట్స్ ఎక్కువగా ఉండి, టీచర్లు లేనట్లయితే తాత్కాలికంగా ఆ మండలంలో అడ్జస్ట్ చేయవచ్చు. లేదంటే నియోజకవర్గం పరిధిలోనే సర్దుబాటు చేయాలి. కానీ, కామారెడ్డి జిల్లాలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లుచేపట్టారు. కొందరు టీచర్లు పైరవీలు చేసుకొని తమకు నచ్చిన స్కూల్‌కు, తమకు అనుకూలంగా ఉండే స్కూల్స్‌కు డిప్యూటేషన్ వేయించుకుంటున్నారు. ఆఫీసర్లు మండల పరిధి, నియోజకవర్గ పరిధి కాకుండా.. ఒక మండలం నుంచి మరో మండలం, మరో డివిజన్‌కు డిప్యూటేషన్ ఇస్తున్నారు. హైదరాబాద్, కామారెడ్డి నుంచి రాకపోలకు అనుకూలంగా ఉండేలా సర్దుబాట్లు చేశారనే ఆరోపణలున్నాయి. రూల్స్‌కు విరుద్ధంగా చేపట్టిన డిప్యూటేషన్లను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల ఉన్నతాధికారులకు యూనియన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఇదీ పరిస్థితి..
రామారెడ్డి మండలం అన్నారం నుంచి కామారెడ్డి టౌన్ జడ్పీ హైస్కూల్(హన్మాన్ మందిర్)కు డిప్యూటేషన్ ఇచ్చారు. పెద్ద కొడప్గల్ మండలం కౌలాస్ నుంచి ఎల్లారెడ్డి మండలం మత్మాల్ కుఒక టీచర్‌కు డిప్యూటేషన్ ఇచ్చారు. ఇక మతమాల్ నుంచి కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి డిప్యూటేషన్ ఇచ్చారు. నాగిరెడ్డిపేట మండలం చీనూర్ హైస్కూల్ నుంచి డీఈవో ఆఫీస్‌కు ఒకరిని డిప్యూటేషన్ వేశారు. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి స్కూల్ నుంచి కామారెడ్డి టౌన్ గంజ్ హైస్కూల్‌కు డిప్యూటేషన్‌పై పంపారు. జుక్కల్ నియోజక వర్గం నుంచి లింగంపేట మండలానికి ఒక టీచర్ ను అడ్జస్ట్మెంట్పై పంపారు.
లింగంపేట మండలం నుంచి బీబీపేట మండల కేంద్రంలోని స్కూల్‌కు ఓ టీచర్‌ను తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పంపారు.