కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : హనుమకొండ సిటీలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ చెప్పారు. వరంగల్ నగరంలోని భద్రకాళీ బండ్ వద్ద రూ. 40 లక్షలతో ఏర్పాటుచేసిన బోటింగ్‌ను శుక్రవారం ప్రభుత్వ చీప్ విప్ వినయ్ భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ వరంగల్ సిటీ వాసుల మానసికోల్లాసానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. భద్రకాళీ బండ్, ఆలయం, పద్మాక్ష్మి జైన్ టెంపుల్, సరిగమ పార్క్, పబ్లిక్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.