ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి

ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.- హైటెక్స్ లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్ది్ళ్ల శ్రీదర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫార్మా రంగ ప్రతినిధులు  పాల్గొన్నారు. దేశ విదేశాలకు హైదరాబాద్ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 

పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు. టెక్నాలజీ అభివృద్ధిలో ఏఐ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పలు అంశాలు మాట్లాడారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఉన్నాయని అది రాష్ట్రానికి గర్వకారణమని భట్టి అన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మెడిసిన్ ఎగుమతి చేస్తున్నాం అన్నారు.
కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారని ఫార్మసిస్టుల సేవలను ఆయన కొనియాడారు. ఫార్మా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది అన్నారు. 

హైదరాబాద్  బిర్యానీకి ప్రసిద్ధి, ఇప్పుడు బిర్యానీతోపాటు బయో ఫార్మా ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అందుబాటులో తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమన్నారు. బౌల్ అఫ్ ఫార్మ గా హైదరాబాద్ స్థిరపడిందన్నారు. సుగంధ ద్రవ్యాలను సరఫరా చేసే స్థాయి నుంచి మానవ జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది అన్నారు.