ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫ్యూటీ సీఎం, పలు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మూడు నెలల పాటు షూటింగ్ కు రాలేనంటూ నిర్మాతలకు చెప్పారు. బుధవారం పిఠాపురం వారాహి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ తన నిర్ణయాన్న ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. నాకు సినిమాలు చేసే టైమ్ ఉంటుందా.? క్షమించాలని నిర్మాతలను కోరారు. 3 నెలల తర్వాత కుదిరినప్పుడు రెండుమూడు రోజులు సినిమాలు చేస్తా అని అన్నారు. మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారని సభలో చెప్పారు. మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటానని నిర్మాతలకు డేట్స్ ఇవ్వలేనని క్షమాపణలు చెప్పారు ఎపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.