నల్లగొండ జిల్లా : దామచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పనులపై జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం, మంత్రులు బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగ్ నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పవర్ ప్లాంట్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. 2025 మార్చి లోపు పవర్ ప్లాంట్ నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశించారు మంత్రులు.
Also Read :- ABVP విద్యార్థి సంఘాల ధర్నా
మహోన్నత ఆశయం కోసం భూమిని త్యాగం చేసి.. ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని గౌరవించాలని.. భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యే లోగా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. కూలీలను పెంచి, పవర్ ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా, ఇతర అవసరాలకు 4 లైన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రులు చెప్పారు.