పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి: భట్టి విక్రమార్క

సెక్రటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 7లక్షల కోట్ల అప్పు చేస్తే... తమ ప్రభుత్వం వచ్చాక రూ. 52వేల కోట్లు అప్పు చేశామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు భట్టి విక్రమార్క. 

తమ ప్రభుత్వ హయాంలో రూ.24వేల 360కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెడిషన్స్ కోసం ఖర్చు చేశామని.. రూ. 61వేల 194కోట్లు సోషల్ వెల్ఫేర్ కోసం ఖర్చు చేశామని అన్నారు. రూ. 64వేల 500కోట్ల అప్పులు కట్టమని అన్నారు భట్టి విక్రమార్క. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. 

పదేళ్లు బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రం అతలాకుతలం అయిందని... బీఆర్ ఎస్ పాలనలో  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. గత సర్కార్ చేసిన అప్పుల మిత్తికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో టీజీఎస్ పీఎస్సీ ద్వారా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని అన్నారు భట్టి విక్రమార్క