డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది.. కాన్వాయ్ లో ఉన్న పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆదివారం ( జనవరి 5, 2025 ) జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జనగామ లోని పెంబర్తి కళాతోరణం వద్ద చోటు చేసుకుంది ప్రమాదం.
ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఇదిలా ఉండగా.. భట్టి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది.. భట్టిని కలిసి రైతు భరోసా అమలుపై వినతి పత్రం ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేయటంతో..ఆయనను ఆఫీసులో ఉంచి తాళం వేశారు పోలీసులు.