రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉంది.. రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరు : డిప్యూటీ సీఎం భట్టీ

 రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉంది.. రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరు : డిప్యూటీ సీఎం భట్టీ

రైజింగ్ తెలంగాణను ఎవరూ ఆపలేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, మంత్రులతో కలిసి వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అది చూడకుండా బీఆర్ఎస్ విమర్శలకు దిగుతోందని అన్నారు.  రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉందని, బీఆర్ఎస్ మాదిరిగా తమది గడీల పాలన కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాము బీఆర్ఎస్ మాదిరిగా మాట ఇచ్చే తప్పే రకం కాదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా భట్టీ అన్నారు. కులగణనలో పాల్గొనని నేతలు మమ్మల్ని విమర్శిస్తారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేశామని, జాతరలాగా సంక్షేమ పథకాలుఅమలు చేస్తున్నామని భట్టీ తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ లాగా పథకాలు ఎందుకు అమలు చేయలేదో బీఆర్ఎస్ ను ప్రశ్నించాలని కార్యకర్తలకు సూచించారు.