ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అద్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ పాలకుడు ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారని అన్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా పని చేయటం మర్చిపోలేనని అన్నారు.
వైఎస్సార్ చివరి వరకు ప్రజల కోసమే పని చేసారని అన్నారు.ముఖ్యమంత్రిగా వైఎస్ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఇంబర్స్మెంట్, 108వంటి సేవలు దేశానికే ఆదర్శమని అన్నారు.రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు.