భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యయసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ALSO READ : స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొట్టమొదటి విజయదశమి పండగన్న భట్టి విక్రమార్క.. దసరా బహుమతిగా పవర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనంద దాయకమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్ళల్లో తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అశ్వారావుపేట ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా రెండు గ్రామాలను తీసుకుని సోలార్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని మాటిచ్చారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇక వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 9లోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామని అన్నారు. పంటల బీమాకు పథకం అమలు చేస్తామన్నారు.
"1986లో ఎన్టీఆర్ పెదవేగిలో మొక్క నాటారు. 1990 తర్వాత తెలంగాణలో వేశాం. టన్ను ధర ఇరవై వేలు ఉండేలా దృష్టి పెడతాం. అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్రం దగ్గరకి వెళ్తాము. వచ్చే నెలలో మరో 13 వందలు పెరుగుతుంది. రాహుల్ గాంధీ గారి సారథ్యంలో 20 వేలు కంటే ఎక్కువ వచ్చేలా ప్రణాళిక చేసుకుందాం.." అని పామాయిల్ సాగు రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడారు.