హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించింది. ప్రతి కార్మికుడి ఖాతాలో రూ. 93,750 చొప్పున దీపావళి బోనస్ ను ఇవ్వనుంది. రేపు కార్మికుల ఖాతాల్లో జమచేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క చెప్పారు.
ఇందుకోసం రూ.358 కోట్లను విడుదల చేసినట్టు ఆయన వివరించారు. ఈ బోనస్ సంస్థలో పనిచేసే 42 వేల మంది కార్మి కులకు వర్తిస్తందని ఆయన వివరించారు.