![వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వండి.. మంత్రి నిర్మలా సీతారామన్‌కు భట్టి విజ్ఞప్తి](https://static.v6velugu.com/uploads/2025/02/deputy-cm-bhatti-vikramarka-asked-union-minister-nirmala-sitharaman-to-give-funds-to-telangana_2M4kKHVIUr.jpg)
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖల మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆమెను అధికారిక నివాసంలో కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి చర్చించారు. గతంలో కూడా ఆయా అంశాలకు సంబంధించి రాసిన లేఖలను కూడా ఆమెకు అందజేశారు. వివిధ కార్పొరేషన్‌లు, ఎస్‌పీవీల ఋణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 408. 49 కోట్లను ఇవ్వాలన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద.. వెనుకబాటు- జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. 2014 ~-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు-ను సరిచేయాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం.. రూ. 208.24 కోట్లు- చెల్లించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశంపైన చర్చించారు. ఏపీ, తెలంగాణ పవర్ యుటిలిటీ-ల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే పరిష్కారం చేయాలని భట్టి కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.