డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన  సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు  హైదరాబాద్‌ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.   వెంకటేశ్వర్లు   అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం వైరాలో జరగనున్నాయి. సోదరుడి మరణవార్త తెలియగానే  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వైరాకు బయలుదేరారు.   హోమియో ఎండి చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మరోవైపు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు వెళ్లనున్నారు. సోదరుడి మరణంతో ఈ పర్యటనకు భట్టి దూరంగా ఉండనున్నారు.