- రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుదాం
- విపక్షాల నుంచి ఆశించిన మద్దతు రాలే
- తెలంగాణకు అన్యాయం జరిగినందుకే బాధ
- సీఎంపై కేటీఆర్ మాట్లాడిన తీరు బాగాలేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకోసం అందరం కలిసి పోరాడుదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవాళ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామన్నారు. తామను ప్రవేశపెట్టిన చర్చకు ప్రతిపక్షాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకే తమకు బాధగా ఉందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని, మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలని అడిగామని అన్నారు. తాము పెట్టిన చర్చకు విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో మండలిలో ఫ్లోర్ లీడర్ గా పనిచేశారని, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం పై మాట్లాడిన తీరు బాగాలేదని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు.