దోచుకోవడం, దాచుకోవడం గత పాలకుల తీరు.. సంపద సృష్టించడం మా తీరు: డిప్యూటీ సీఎం భట్టి

దోచుకోవడం, దాచుకోవడం గత పాలకుల తీరు.. సంపద సృష్టించడం మా తీరు: డిప్యూటీ సీఎం భట్టి

కొనిజర్ల మండలం చిన్నగోపతి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ది దోపిడీ ప్రభుత్వం, దొరల ప్రభుత్వం అని.. తమది ప్రజా ప్రభుత్వం, సంక్షేమ పధకాలు ప్రజలకు పంచే ప్రభుత్వమని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం గత పాలకుల తీరు అని.. సంపద సృష్టించడం, ప్రజలకు పంచడం తమ ప్రభుత్వ తీరు అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. నాలుగు పథకాలే అనే చిన్న చూపు చూస్తున్నారని.. నాలుగు పథకాల అమలుకు సంవత్సరానికి 47 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని అన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. 

ALSO READ | ‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’: హరీశ్ రావు సవాల్

కేంద్రంలో ఉన్న బిజెపి రాజ్యాంగాన్ని మార్చాలని మత రాజకీయాలు చేస్తోందని.. బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా బిజెపితో జతకట్టి రాజకీయాలు చేసిందని అన్నారు భట్టి. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని.. కావాలనే కొందరు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు భట్టి.ముఖ్యమంత్రి నుండి క్యాబినెట్ లో ఉన్న మంత్రులంతా పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని అన్నారు భట్టి.