పుట్టింది బతకడానికే కానీ..చావడానికి కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని భట్టి విక్రమార్క పరామర్శించారు. ప్రభాకర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం..ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు భట్టి.. రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భట్టి విక్రమార్క. ప్రభాకర్ భూమికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.