హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజా ప్రభుత్వంలో మొదటి బోనాల పండుగ అని అన్నారు. అమ్మ వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. పాత బస్తీ ప్రజలను మహంకాళి అమ్మవారు నిరంతరం కాపాడుతోందన్నారు. బోనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఎం ఆదేశాలతో అన్ని దేవాలయాలలో పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు.
బడ్జెట్ లో హైదాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించామని చెప్పారు భట్టి. సకల సౌకర్యాలకు హైదరాబాద్ కేంద్ర కావడంతో ఇతర ప్రాంతాల వాళ్లు నివాసం ఉంటున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరంగా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆలయ కమిటీ.. ఇతర ప్రభుత్వ శాఖల కృషితో లాల్ ధర్వాజ బోనాల పండుగ ఘనంగా జరుగుతోందన్నారు భట్టి