వేసవిలో రెప్పపాటు కూడా కరెంట్‌‌‌‌‌‌‌‌ పోవద్దు : డిప్యూటీ సీఎం భట్టి

వేసవిలో రెప్పపాటు కూడా కరెంట్‌‌‌‌‌‌‌‌ పోవద్దు : డిప్యూటీ సీఎం భట్టి
  • డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు సరఫరా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • ఫీల్డ్ విజిట్స్‌‌‌‌‌‌‌‌తో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయండి 
  • కరెంట్‌‌‌‌‌‌‌‌ సరఫరా ప్లానింగ్‌‌‌‌‌‌‌‌పై మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఉన్నతాధికారులకు ఆదేశం​
  • విద్యుత్‌‌‌‌‌‌‌‌ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్​1912పై ప్రచారం చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎండాకాలంలో రెప్పపాటు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తట్టుకునేలా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. గురువారం ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో ఆఫీసర్లతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ స్టేషన్ల వారీగా ఓవర్ లోడ్ సమస్యలను గుర్తించి  పరిష్కరించాలని సూచించారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా సీఎండీలు మొదలుకొని ఎస్ఈల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కింది స్థాయి అధికారులతో రివ్యూలు, అవగాహన సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకుంటున్న చర్యల గురించి వివరాలివ్వాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల్లో వినియోగదారులను, మీడియా ప్రతినిధులను భాగస్వామం చేయాలని సూచించారు. అలాగే, ఉన్నతాధికారుల ఫీల్డ్ విజిట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన 1912 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

దీనికి సంబంధించి నిర్వాహణ, ప్రచారానికి అదనపు నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఆయన వెల్లడించారు. ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వేసవికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఒకవేళ విద్యుత్ సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తూ 132/33 కేవి సబ్ స్టేషన్లలో కావాల్సిన సామర్థ్యం మేరకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల సంఖ్యను పెంచుతున్నామన్నారు. 


మార్చిలో 6,328 మెగావాట్ల విద్యుత్ డిమాండ్: ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి 

వచ్చే మార్చిలో 6,328 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ చేరుకునే అవకాశం ఉందని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 44 పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, మరో 32 వచ్చే నెల వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, ప్రత్యామ్నాయ లైన్ల ఏర్పాటు, 17 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా మార్చిలో 12 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

జనవరి 29న అధికారులతో కలిసి జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో, ఫిబ్రవరి 4న ఎస్ఈలు డివిజన్ స్థాయిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తూ నాణ్యమైన కరెంటును సరఫరాపై చర్చిస్తారని సీఎండీ వరుణ్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో, నార్తర్న్ డిస్కం డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

న్యూ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి పెట్టుబడులు


విద్యుత్ సంస్థలకు సబ్సిడీలు చెల్లిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: విద్యుత్ శాఖలో ఏండ్ల తరబడి వేచిచూస్తున్న 5 వేల మందికి ఒకేసారి ప్రమోషన్లు కల్పించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్​ను డిప్యూటీ సీఎం గురువారం ఆవిష్కరించి, మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలని న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినం. ఈ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి.

అందరి అభిప్రాయాల మేరకు న్యూ ఎనర్జీ పాలసీ రూపొందించినం. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నం. ఈ మేరకు విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఇప్పటి దాకా రూ.12,486 కోట్లు చెల్లించింది. గృహజ్యోతి కింద అందిస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కోసం రూ.1,538 కోట్లు ప్రభుత్వం పే చేసింది. గవర్నమెంట్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్ కోసం రూ.199 కోట్లను విద్యుత్ శాఖకు చెల్లించాం’’అని అన్నారు.  కార్యక్రమంలో ఎనర్జీ సెక్రటరీ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్​, పవర్ ఇంజనీర్స్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, యూనియన్​ లీడర్లు పాల్గొన్నారు. 

టీఈఏఎస్​ఏ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ (టీఈఏఎస్ఏ) 2025 డైరీ, క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కరుణాకర్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ప్రజా భవన్ లో భట్టిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రావు, ఈశ్వరయ్య గౌడ్, కుమారస్వామి, సాంబశివరావు, బాలరాజు, రాజు, సురేశ్, హరిహరన్, వేదప్రకాశ్, నిత్యకల్యాణి, కల్పన, అశోక్, రమేశ్, భానురేఖ పాల్గొన్నారు.