ముగిసిన భట్టి విక్రమార్క విదేశీ పర్యటన

ముగిసిన భట్టి   విక్రమార్క విదేశీ పర్యటన

 

  • హైదరాబాద్​కు రాక.. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
     
    హైదరాబాద్​, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. శుక్రవారం ఆయన హైదరాబాద్ కు​ చేరుకోగా.. శంషాబాద్​ ఎయిర్ పోర్ట్​లో పార్టీ శ్రేణులు, అధికారులు  ఘన స్వాగతం పలికారు. గత నెల 24న ఆయన విదేశీ పర్యటన ప్రారంభమైంది.  11 రోజులపాటు అమెరికా, జపాన్​ దేశాల్లో భట్టి అధికారికంగా పర్యటించారు. అమెరికా పర్యటనలో భాగంగా  అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ ‘మైనెక్స్-–2024’లో కోమత్సు , హిటాచి, క్యాటర్ పిల్లర్ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక  షావెల్స్, డంపర్లు,  కంటిన్యూయస్ మైనర్ యంత్రాలు, గనిలో ప్రమాదాలు జరగకుండా చూసే రక్షణ వ్యవస్థలను పరిశీలించారు. 

లేటెస్ట్​ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్, ఆధునిక మైనింగ్ విధానంలో అధికోత్పత్తిని సాధించే భారీ యంత్రాలు, వర్చువల్ రియాలిటీతో రక్షణ చర్యలపై అధ్యయనం చేశారు. అమెరికాలో  అతిపెద్ద హూవర్  హైడల్​పవర్​స్టేషన్​ డ్యామ్ ను సందర్శించి, జల విద్యుదుత్పత్తి విధానాలు, రక్షణ చర్యలను తెలుసుకున్నారు. అలాగే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను భట్టి విక్రమార్క ఆహ్వానించారు.