
యాదాద్రి భూ నిర్వాసితులకు నిర్వాసితుల కోటాలో ప్రభుత్వాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టీజీపీఎస్ సీ దారా ఎంపికైన 112 మంది డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు భట్టి.
ప్రజా ప్రభుత్వంలో నియామకాలు చేపడుతున్నామన్నారు భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాలు పొందలేని వారికి రాజీవ్ యువ వికాసంతో ఉపాధి దొరుకుతుందన్నారు. మొదటి సారి యువత ఉపాధికి రూ. 9వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో 59 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు భట్టి.
►ALSO READ | కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం: రాజగోపాల్ రెడ్డి
గత ప్రభుత్వం నిర్వాసితులు ముసలివాళ్లు అయినా ఉద్యోగాలివ్వలేదన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.. ఫ్యూచర్ సిటీతో పెట్టుబడులు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు భట్టి విక్రమార్క..