కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025–26పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్షిక బడ్జెట్‌లో మళ్లీ తెలంగాణకు మెుండి చేయి చూపిందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.