
ఎర్రుపాలెం,వెలుగు: మండలంలోని జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బుధవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆలయ ఈవో జగన్ మోహన్ రావు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. దేవాలయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ను కూడా ఆహ్వానించారు. ఈనెల30 నుంచి ఏప్రిల్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.