రాహుల్ గాంధీతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.!

ఢిల్లీలో రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, రాష్ట్ర రాజకీయాలు, మంత్రి వర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్ తో భట్టి  మాట్లాడినట్టు సమాచారం. 

ALSO READ | రాహుల్, ప్రియాంకతో మంత్రి సీతక్క భేటీ.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ

రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా  డిసెంబర్ 12న ఢిల్లీ రానున్నారు. ముఖ్యమంత్రి కూడా రాహుల్ తో పాటు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్  పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులు,గ్రాంట్లు విడుదల చేయాలని కోరనున్నారు.