- బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్‌తో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: అన్ని రకాల వసతులు ఉన్న హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించాలని.. ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గురువారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్, బ్రిటిష్ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నలిని రఘురామన్ సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలు చర్చించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలు స్థాపించడానికి హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని వివరించారు. అందరికీ అనుకూలమైన వాతావరణం, తక్కువ ధరలో మానవ వనరులు, నిరంతరాయం నాణ్యమైన విద్యుత్ సరఫరా , తాగునీటి సదుపాయాలను వివరించారు. వీటికి తోడు రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి జరుగుతున్న కార్యాచరణను వివరించారు.