తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి.. పార్లమెంట్లో ప్రశ్నించాలి: భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి.. పార్లమెంట్లో ప్రశ్నించాలి: భట్టి విక్రమార్క

 తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  ప్రజాభవన్ లో   భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీల ఎంపీల మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. బీఆర్ఎస్,బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు.  మీటింగ్ అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క.   కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలపై మీటింగ్ లో  చర్చించామన్నారు భట్టి. అఖిలపక్షంలో 28 అంశాలపై చర్చించామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించామని చెప్పారు. 

రాష్ట్ర నిధులపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలిస్తామన్నారు భట్టి. రాష్ట్రానికి వచ్చిన నిధులు, రావాల్సిన నిధులపై ఎంపీలకు  అవగాహన కల్పించామన్నారు.
పార్లమెంట్ లో రాష్ట్రానికి రావాల్సి నిధులపై ప్రశ్నిస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి పారదర్శకంగా నిధులు ఇస్తుందన్నారు భట్టి విక్రమార్క.

ALSO READ | వరంగల్లో దేశంలోనే తొలి గోల్డ్ లోన్ ATM.. పావు గంటలో చేతికి డబ్బులు !

నెక్ట్స్ మీటింగ్ కు ముందే ఎంపీలకు సమాచారం ఇస్తామన్నారు భట్టి విక్రమార్క.   విభజన సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు భట్టి.   రాష్ట్ర నిధులపై పార్లమెంట్ లో ఎలా పోరాడాలనేది చర్చించామని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలు వివరించాలన్నారు.  ఉన్నత  భావాలతో ఎంపీల సమావేశం ఏర్పాటు చేశామన్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం ,పార్లమెంటులో సమస్యలు లేవనెత్తడం చేయాలన్నారు భట్టి.