ఎర్రుపాలెం(బోనకల్లు), వెలుగు : బోనకల్లు మండలంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పలు గ్రామాల్లో రూ.21.14కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయనకు మహిళలు మంగళ హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు.
ఆయా చోట్ల సీసీ, బీటీ రోడ్లు పనులకు, జానకిపురం, రాపల్లి, రొంపిమల్ల గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బోనకల్ తహసీల్దార్ కార్యాలయం పక్కన ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ టీ పాయింట్ ను ప్రారంభించారు. బోనకల్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.