10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చుచేసి రాష్ట్రానికి చేసిందేంటి.?: భట్టి విక్రమార్క

10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చుచేసి  రాష్ట్రానికి చేసిందేంటి.?: భట్టి విక్రమార్క

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తూర్పారబట్టారు. పదేళ్లలో 16లక్షల 770 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టి.. వ్యవస్థలను విధ్వంసం చేసి..ఆర్థిక అరాచకం సృష్టించారని మండిపడ్డారు.  ఇలాంటి వాళ్లు బుద్ధి, మాంద్యం గురించి కామెంట్లు చేస్తారా అని హరీశ్ పై ధ్వజమెత్తారు భట్టి. అడ్డగోలుగా బడ్జెట్ ను పెంచకుండా దుబారా ఖర్చులు తగ్గించామన్నారు.  బట్జెట్ లో చేయగల్గినవే పెట్టాం..చేయాల్సినవి ఈ ఏడాదిలోనే చేసి చూపిస్తామన్నారు. వందకు వంద శాతం బడ్జెట్ ను ఖర్చు చేస్తామని చెప్పారు భట్టి.

భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

  • గత బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు బడ్జెట్ ఖర్చుపెట్టలేదు
  • బీఆర్ఎస్ హయాంలో జీఎస్ టీ వృద్ధి రేటు 8.4 ఉంటే..మా హయాంలో 12.3 గా ఉంది
  • పదేళ్లు 16 లక్షల 770 కోట్ల బడ్జెట్ పెట్టి రాష్ట్రానికి ఏం చేశారు
  • వ్యవస్థలను విధ్వంసం చేసి..ఆర్థిక అరాచకం సృష్టించారు
  •  2015-16 లో  15 శాతం నిధులు ఖర్చు చేయలేదు
  • 16-17లో 6 శాతం నిధులు ఖర్చు చేయలేదు
  • 2017 -18లో 19 శాతం నిధులు ఖర్చు చేయలేదు
  • 18 -19 లో 22  శాతం నిధులు ఖర్చు చేయలేదు
  • 22- 23లో  20 శాతం నిధులు ఖర్చు పెట్టలేదు
  • 23-24లో 20 శాతం నిధులు ఖర్చు చేయలేదు
  • బీఆర్ఎస్ తీరును కాగ్  కూడా తప్పుబట్టింది
  • ప్రతి ఏడాది పది నుంచి 15 శాతం బడ్జెట్ ను పెంచుకుంటూ పోయారు
  •  మీ లాగే బడ్జెట్ ను పెంచుకుంటూ పోతే 4 లక్షల 18 కోట్లు దాటేది
  • గత ప్రభుత్వంలా అడ్డగోలుగా బడ్జెట్ ను పెంచలేదు
  • 4.7 శాతమే బడ్జెట్ పెంచాం
  • అందుకే బడ్జెట్ ను 3.04 లక్షల కోట్లకు కుదించాం
  • బడ్జెట్ ను కుదించి వాస్తవాలు చూపించాం
  • చేయ గలిగిందే చెప్పాలని మా ప్రభుత్వం  నిర్ణయించింది
  • చేయాల్సింది ఈ ఏడాది బరాబర్ చేసి చూపిస్తాం
  • చేయగల్గినవే మేం బడ్జెట్ లో పెట్టాం
  •  వందకు వంద శాతం బడ్జె్ట్ ను ఖర్చు చేస్తాం
  • మాకు వచ్చిన ఆదాయం 2లక్షల 80 వే ల603 కోట్లు
  • ఉద్యోగుల  జీతాలకు రూ. 77 వేల కోట్లు..అప్పులకు 88వేల కోట్ల వడ్డీలు కట్టినం ఖర్చు చేశాం
  • ఇతర స్కీంలకు లక్షా 34 వేల కోట్లు ఖర్చు చేశాం
  • మొత్తంగా రూ.2లక్షల 99వేల4414కోట్లు ఖర్చు చేశాం
  • పదేండ్లులో మీరు చెప్పుకునే ఘనత ఒక్క కాళేశ్వరం ఒక్కటే
  • ఆ కాళేశ్వరం ఎట్లుందో మనందరికీ తెలుసు
  • క్రమశిక్షణ లేకనే అడ్గగోలుగా ఖర్చు చేశారు
  • బాష పట్ల బీఆర్ఎస్ నేతలు  పద్దతి మార్చుకోవాలి
  • మేం జనాలను మోసం చేయదల్చుకోలేదు
  • అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ల నిర్మాణం
  • ఒకే దశలో58 స్కూళ్లను నిర్మిస్తున్నం
  •  విద్యాశాఖను సీఎం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు
  • రాష్ట్రంలో వర్శిటీలకు వీసీలను నియమించాం
  •  సీఎం పట్టించుకోకపోతే ఇవన్నీ జరిగేవా?
  • ఉస్మానియాకు దళిత వీసీని  నియమించాం
  • మేము సోషల్ జస్టిస్ తో ముందెకెళ్తున్నాం
  •  కోఠి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి మహిళా వర్శిటీగా ప్రకటించాం
  • 65 ఐఐటీలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నాం
  • పదేండ్లు విద్యాశాఖను గాలికొదిలేసిన చరిత్ర మీది
  •  11 వేల డీఎస్సీ పోస్టులను 50 రోజుల్లో  భర్తీ చేసినం
  • హాస్టళ్లో డైట్ చార్జీలు పెంచాం
  • 22 వేల టీచర్లకు ప్రమోషన్..36 వేల మంది టీచర్లకు బదిలీలు చేశాం
  • ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రబుత్వం ప్రయత్నించింది
  • పదేండ్లు ప్రజలను భ్రమల్లో బతికించారు. ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్లు చూపించారు
  • ప్రజల్ని ఓటు బ్యాంక్ కోసమే చూశారు తప్ప  రాష్ట్రాన్ని పట్టించుకోలేదు